ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణ26న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

26న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, వరంగల్: బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్, రజక మిత్రమండలి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. కాపువాడలోని భద్రకాళి చెరువు సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం జరుగుతుందని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల సుదర్శన్ తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు కూరపాటి వెంకటనారాయణ, మాజీ చైర్మన్ ఎస్.సుందర్‌రాజు, కార్పొరేటర్ తోట వెంకన్న తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకోనున్నట్లు తెలిపారు. వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో విశిష్ట సేవలందించిన పలువురిని సత్కరించనున్నట్లు వెల్లడించారు. పాలడుగుల అంజయ్య, ఓరుగంటి పూర్ణచందర్, చీకటి వీరస్వామి, నాగపురి సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొంటారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular