స్పాట్ వాయిస్, నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ చేపట్టే నల్లబెల్లి బంద్‌ను విజయవంతం చేయాలని లెంకలపల్లి గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి రవీందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంతో పాటు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్ది సుదర్శన్ రెడ్డి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించడం బాధాకరమన్నారు. బంద్‌కు ప్రజలు, వ్యాపారులు, అభిమానులు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలని కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను గౌరవిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.
