ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణబ్రిటీష్ కాలం నాటి ఆలోచనా విధానాలను వీడాలి: కవిత

బ్రిటీష్ కాలం నాటి ఆలోచనా విధానాలను వీడాలి: కవిత

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్ , హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మన చరిత్రను తెలుసుకున్నప్పుడే భవిష్యత్‌ను చక్కగా నిర్మించుకోగలమన్నారు. బ్రిటీష్ పాలనలో జరిగిన అన్యాయాలు, విభజించి పాలించిన విధానం, స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మన పూర్వీకుల త్యాగాలు, పోరాట చరిత్రను పిల్లలకు వివరించాలని సూచించారు.బ్రిటీష్ పాలన ముగిసినా వారి ఆలోచనా విధానాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇంగ్లీష్ మాట్లాడేవారినే గొప్పగా చూడటం, మాతృభాషను తక్కువగా చూడటం వంటి భావనలు మారాలని అన్నారు. భారతీయ సంస్కృతి, భాషలు, చరిత్రపై గౌరవం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశం నుంచి తీసుకెళ్లిన కోహినూర్‌ సహా సంపదను తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తోందన్నారు. చరిత్రను పూర్తిగా తెలుసుకున్నప్పుడే మెరుగైన భవిష్యత్‌ను నిర్మించగలమని కవిత పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular