రఘునాథపల్లి, స్పాట్ వాయిస్ : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం సాయంత్రం 3.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ ధనంజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తిగత పనిపై జనగామకు బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుడు ప్రస్తుతం అసంపర్తి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
