స్పాట్ వాయిస్, నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు అమెరికా వైద్యుల సలహాలతో వీడియోకాల్ ద్వారా ప్రత్యేక వైద్య చికిత్స అందించినట్లు తెలిసింది. అయితే 72 గంటలు గడిచినా శరీరం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని వైద్యులు తెలిపినట్టు సమాచారం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

