ePaper
Friday, September 11, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కుక్కలను తప్పించబోయి ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కుక్కలను తప్పించబోయి ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలోని కిలో షాపురం రోడ్డు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం, తరచూ రోడ్డుపైకి వస్తున్న వీధి కుక్కలను తప్పించేందుకు ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular