స్పాట్ వాయిస్, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది.బ్లాస్టింగ్‌కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పేలింది.ఈ ఘటనలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.పేలుడుతో అతని చేతి వేళ్లు దెబ్బతిని విడిపోయినట్లు సమాచారం.గాయపడిన కార్మికుడిని తోటి సిబ్బంది వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.నాసిరకం సామగ్రి వాడకంపై గని మేనేజర్ రమేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

