ePaper
Wednesday, May 13, 2026
ePaper
Homeఎడిటోరియల్రక్త సంబంధం మరిచారు..

రక్త సంబంధం మరిచారు..

📰 Generate e-Paper Clip

 

  • అక్కాతమ్ముళ్ల పెళ్లి..

  • కర్ణాటకలో సంచలనం

స్పా ట్ వాయిస్ , వరంగల్: కర్నాటక రాష్ట్రంలో వెలుగుచూసిన ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ బంధాలను పక్కనపెట్టి రక్త సంబంధం ఉన్న యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

  • మూడేళ్లుగా ప్రేమ

చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన శశికళ, ప్రవీణ్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో, కుటుంబ పరంగా శశికళ – ప్రవీణ్ అక్కాతమ్ముళ్ల బంధంలోకి వస్తారు. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

  • యువతికి వేరే పెళ్లి నిశ్చయం

ఇటీవల శశికళకు కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రవీణ్, శశికళ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం తమకు కుటుంబ సభ్యుల నుంచి ముప్పు ఉందని చెబుతూ పోలీసులను ఆశ్రయించారు.

  • పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా

ఈ ఘటనతో రెండు కుటుంబాల సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని యువతిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కుటుంబ పెద్దలు, బంధువులు ఎంత చెప్పినా శశికళ మాత్రం “భర్తతోనే ఉంటాను” అని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిసింది.

రక్త సంబంధం ఉన్న వారిద్దరూ వివాహం చేసుకోవడం పై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు దీనిని సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శిస్తుండగా, మరికొందరు వ్యక్తిగత నిర్ణయంగా చూస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular