ePaper
Wednesday, June 10, 2026
ePaper
Homeఎడిటోరియల్రుద్రమ’ బ్రాండ్‌తో మహిళా సాధికారతకు నాంది

రుద్రమ’ బ్రాండ్‌తో మహిళా సాధికారతకు నాంది

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.

-స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రారంభం.

-ఎస్ హెచ్ జి వివో, వర్క్ షెడ్,జి ఎం డైరీ, సమావేశ మందిరం భవన నిర్మాణాలకు శంకుస్థాపన 

స్పాట్ వాయిస్ దామెర: ‘రుద్రమ’ బ్రాండ్‌తో తెలంగాణ మహిళా ఆత్మగౌరవానికి, సాధికారతకు ల్యాదేళ్ల గ్రామంలో నాంది పలికామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఆదివారం మండలం లోని ల్యాదేళ్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా శక్తి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా, పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వీ-హబ్ సీఈవో సీతా పల్లాచోళ్ల,డి ఆర్డీఓ శ్రీనివాస్,మహిళా సోదరీమణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌జీ వివో, వర్క్ షెడ్, జీఎం డైరీ, సమావేశ మందిరం భవనాలకు శంకుస్థాపన చేశారు.అనంతరం మహిళా సమాఖ్య సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ..ల్యాదేళ్ల గ్రామంలో ‘రుద్రమ’ బ్రాండ్ పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కావడం గర్వకారణమని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ కేంద్రం, గ్రామీణ మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.స్థానిక మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ హబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

వీ-హబ్ , జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయని అన్నారు. మహిళలు ఇక్కడ పొందే శిక్షణతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి ‘రుద్రమ’ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.మహిళల్లో కమిట్‌మెంట్‌తో పనిచేసే శక్తి అపారంగా ఉందని, వీరోచిత పోరాటానికి ప్రతీక అయిన రాణి రుద్రమదేవి స్ఫూర్తితో ఉత్పత్తులకు ‘రుద్రమ’ పేరు పెట్టడం అభినందనీయమని అన్నారు. మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగేలా అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళల ఆర్థిక సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ, నిజాయితీ, నిబద్ధతను పెట్టుబడిగా తీసుకొని “పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్”ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో గుమ్మడి కల్పన,మండల వ్యవసాయ అధికారి అల్లే రాకేష్,గ్రామ సర్పంచ్ రవి యాదవ్, ఏ పి ఎం అశోక్,పంచాయతీ రాజ్ శాఖ డి ఈ ఉపేందర్,వి హబ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ ఉహ,ప్రాజెక్ట్ మేనేజర్ గురు ప్రసన్న,ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్ రూపానంద్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దుబాసి రాజేందర్,నాయకులు బిల్లా రమణారెడ్డి,మన్నెం ప్రకాశ్ రెడ్డి, సదిరం పోచయ్య,బిక్షపతి,శ్రీధర్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular