స్పాట్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లాలోని 70 గ్రామాల్లో భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి తెలిపారు. గురువారం దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. భూముల రీసర్వే వల్ల భూ వివాదాలకు తావు ఉండదని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సర్వేయర్లకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
పారదర్శకంగా భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం: అదనపు కలెక్టర్
RELATED ARTICLES

