ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ లో ఇక ఉండలేను..

కాంగ్రెస్ లో ఇక ఉండలేను..

📰 Generate e-Paper Clip

పార్టీలో గౌరవం లేదు.. క్షోభను భరించలేను..
హాట్ టాపిక్ గా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
25న రాజీనామా చేసే ఛాన్స్..!
లేఖ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
స్పాట్ వాయిస్, కరీంనగర్ : మొన్నటి వరకు రాజీనామాపై వేచి చూసే ధోరణిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏకంగా తన రాజీనామాపై అధికారిక తేదీలను ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అసంతృప్త సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జగిత్యాలలో నిర్వహంచిన ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి పార్టీని వీడడానికి గల కారణాలపై లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పార్టీలో ఉన్నా కాంగ్రెస్ లో సరైన గౌరవం లేదని, ఇక ఈ క్షోభను భరించలేను.. ఇక పార్టీలో కాంగ్రెస్‌లో కొనసాగలేనని ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న జీవన్ రెడ్డి పార్టీని వీడుతున్నారనే వార్తలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొన్ని నెలలుగా పార్టీ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి గౌరవం లేని చోట పార్టీలో కొనసాగడం కుదరని తేల్చేశారు. తాను ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈనెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే..

‘‘If I say it once, its equal to saying it 100 times’’ -తెలంగాణ పొలిటికల్ సూపర్ స్టార్..’’

కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగనలేనని జీవన్ రెడ్డి ప్రకటించిన కొద్ది సేపట్లోనే ఆయన ఇంటి ముందు ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే’ డైలాగ్ ముద్రించిన వాల్ పోస్టర్లు జగిత్యాలలో కలకలం సృష్టించాయి. దీంతో జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునేది లేదన్న సంకేతాలను ఆయన అభిమానలు స్పష్టం చేసినట్లు అయింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular