ePaper
Monday, September 7, 2026
ePaper
Homeఎడిటోరియల్చేయూత పెన్షన్లు.. ఒక్కరోజే ఛాన్స్

చేయూత పెన్షన్లు.. ఒక్కరోజే ఛాన్స్

📰 Generate e-Paper Clip

31తో ముగియనున్న గడువు.

స్పా ట్ వాయిస్, తెలంగాణ: రాష్ట్రంలో కొత్తగా ‘చేయూత’ పింఛన్లు పొందాలనుకునే అర్హులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఆగస్టు 31తో ముగియనుంది. దీంతో అర్హత ఉన్నవారు చివరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అర్హులకు కొత్త పింఛన్లు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అర్హత కలిగిన లక్షలాది మందికి చేయూత అందించేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది.

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

అర్హులైన వారు తమ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, వార్డు కార్యాలయం లేదా మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు సంబంధిత అర్హతను నిర్ధారించే ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆగస్టు 31 చివరి గడువు కావడంతో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular