ePaper
Monday, October 26, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రోడ్డుపక్కన వృద్ధురాలు.. అండగా నిలిచిన ఎస్సై

రోడ్డుపక్కన వృద్ధురాలు.. అండగా నిలిచిన ఎస్సై

📰 Generate e-Paper Clip

 

స్పాట్ వాయిస్, దామెర: రోడ్డుపక్కన జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలికి దామెర ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సింగరాజుపల్లి గ్రామంలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డుపక్కన పడుకుని ఉన్న వృద్ధురాలిని గుర్తించారు. ఆమె దీనస్థితిని తెలుసుకుని మరుసటి రోజు బెడ్‌షీట్లు, టవల్స్, పండ్లు, నిత్యావసర వస్తువులతో పాటు రూ.3 వేల నగదును అందజేశారు. అవసరమైన వైద్య చికిత్సకు కూడా సహకరిస్తానని భరోసా ఇచ్చారు. కొన్నేళ్లుగా రోడ్డుపక్కనే జీవిస్తున్న వృద్ధురాలికి ఎస్సై అందించిన సాయం స్థానికుల ప్రశంసలు అందుకుంది. విధి నిర్వహణతో పాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular