ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeతెలంగాణఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శిగా బస్కే దశరథం

ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శిగా బస్కే దశరథం

📰 Generate e-Paper Clip

 

కాజీపేట, స్పాట్ వాయిస్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన బస్కే దశరథం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక హనుమకొండ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదివారం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దశరథం మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం కోసం పోరాడుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు శ్యామ్ కృష్ణ, హనుముల రమేష్, దేవేందర్ రెడ్డి, అంజద్, రాజు, రామకుమార్, దస్తగిరి, స్వర్ణలత, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అశోక్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular