ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శిగా బస్కే దశరథం
కాజీపేట, స్పాట్ వాయిస్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన బస్కే దశరథం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక హనుమకొండ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదివారం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దశరథం మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం కోసం పోరాడుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు శ్యామ్ కృష్ణ, హనుముల రమేష్, దేవేందర్ రెడ్డి, అంజద్, రాజు, రామకుమార్, దస్తగిరి,...