స్పాట్ వాయిస్, హసన్ పర్తి: హసన్పర్తి లోని ఎర్రగట్టుగుట్ట బసవ రెడ్డి టౌన్షిప్లోని మిత్ర కాలనీ మహిళలు బొడ్డెమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతిరోజూ ఆటపాటలతో బొడ్డెమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఉత్సాహంగా బొడ్డెమ్మ చుట్టూ పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రకళ, హారిక, సంధ్య, అశ్విని, రమ్య, మాలవి, అరుణ, హరిత, శ్రీదేవి, ప్రవళిక, అఖిల, గీత, సరిత, ఆశాలత, రాధిక, శిరీష తదితరులు పాల్గొన్నారు.

