స్పాట్ వాయిస్, హనుమకొండ: భారీ వర్షాల నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్ 25న (శుక్రవారం) జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

