కొయ్యూరు క్లస్టర్ ఏఈవో అనూష
స్పాట్ వాయిస్, మల్హర్: పట్టా పాస్ బుక్ కలిగిన రైతులు అందరు తప్పని సరిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కొయ్యూరు వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్.అనూష సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులకు ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలతో పాటు యూరియా బుకింగ్, పీఎం కిసాన్ యోజన వంటి సేవలు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. పంటల బీమా, పెట్టుబడి పథకాలు, వివిధ రాయితీ లకు సంబంధించిన ప్రయోజనాలు పొందడం లో ఇబ్బందులు ఎదురవుతాయని కాబట్టి రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేసుకోవాలని కోరారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్ సిద్ధంగా ఉంచుకోవాలని, ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకొని సమీపంలోని మీసేవ కేంద్రాన్ని లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రైతులు ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పూర్తి చేసుకోవాలని వారు సూచించారు.

