రైతులు అందరు ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేసుకోవాలి
కొయ్యూరు క్లస్టర్ ఏఈవో అనూష స్పాట్ వాయిస్, మల్హర్: పట్టా పాస్ బుక్ కలిగిన రైతులు అందరు తప్పని సరిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కొయ్యూరు వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్.అనూష సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులకు ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలతో పాటు యూరియా బుకింగ్, పీఎం కిసాన్ యోజన వంటి సేవలు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. పంటల బీమా, పెట్టుబడి పథకాలు, వివిధ రాయితీ లకు సంబంధించిన ప్రయోజనాలు పొందడం లో ఇబ్బందులు ఎదురవుతాయని...