అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు..
పట్టుకున్న దామెర పోలీసులు
స్పాట్ వాయిస్, దామెర: అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని దామెర పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సీపీ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగొండ నాగేశ్వర్‌రావు (55) సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాకు చెందిన వ్యక్తుల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడి సమాచారం మేరకు అతని ఇంటి నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి కొనుగోలు చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.స్మగ్లర్‌ను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్‌బాబు, సీఐలు సుధాకర్‌రెడ్డి, సంతోష్, దామెర ఎస్‌ఐ వీరభద్రరావు, ఇతర పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

