ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్వివాహిత అదృశ్యం..కేసు నమోదు

వివాహిత అదృశ్యం..కేసు నమోదు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, ​గణపురం:మండల పరిధిలోని రామప్ప క్వార్టర్స్ కు చెందిన ఒక వివాహిత కనిపించకుండా పోయినట్లు స్థానిక ఎస్సై అశోక్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… రామప్ప క్వార్టర్స్ లో నివసిస్తున్న సింగరేణి ఉద్యోగి భార్య మౌనిక (30) సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది.ఉదయం లేచి చూసేసరికి భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భర్త… చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆమె పుట్టినిల్లు, ఇతర బంధువుల ఇళ్లల్లో వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో సోమవారం సాయంత్రం గణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, అదృశ్యమైన మౌనికకు 14 సంవత్సరాల కుమారుడు, 4 సంవత్సరాల కుమార్తె ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular