వివాహిత అదృశ్యం..కేసు నమోదు

స్పాట్ వాయిస్, ​గణపురం:మండల పరిధిలోని రామప్ప క్వార్టర్స్ కు చెందిన ఒక వివాహిత కనిపించకుండా పోయినట్లు స్థానిక ఎస్సై అశోక్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... రామప్ప క్వార్టర్స్ లో నివసిస్తున్న సింగరేణి ఉద్యోగి భార్య మౌనిక (30) సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది.ఉదయం లేచి చూసేసరికి భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భర్త... చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆమె పుట్టినిల్లు, ఇతర బంధువుల ఇళ్లల్లో వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో సోమవారం సాయంత్రం...