ePaper
Wednesday, June 10, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్అసాంఘిక కార్యక్రమాల పాల్పడితే కఠిన చర్యలు

అసాంఘిక కార్యక్రమాల పాల్పడితే కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ భీమ్ శర్మ
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ భీమ్ శర్మ, రూరల్ సీఐ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం రఘునాథపల్లి, లింగాల గణపురం మండలాల రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ, సీఐ మాట్లాడుతూ.. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రత కల్పించడం. అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ప్రజాజీవానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పని హెచ్చరించారు.అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాకేష్ రెడ్డి, ఎస్సైలు నరేష్ యాదవ్, శ్రవణ్ కుమార్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular