ePaper
Saturday, August 1, 2026
ePaper
Homeతెలంగాణరఘునాథపల్లిలో భారీ వర్షం

రఘునాథపల్లిలో భారీ వర్షం

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కిలాషాపూర్ మేకలగట్టు, తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన గాలుల ప్రభావంతో మామిడి తోటల్లో కాయలు భారీగా నేలరాలుతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే నేలపాలవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులు, వర్షాల కారణంగా మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట సాగులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు తాజా వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular