ePaper
Wednesday, April 15, 2026
ePaper
Homeఎడిటోరియల్ఇంజినీరింగ్ అడ్మిషన్ల పేరుతో టోకరా..

ఇంజినీరింగ్ అడ్మిషన్ల పేరుతో టోకరా..

📰 Generate e-Paper Clip

ఇంజినీరింగ్ అడ్మిషన్ల పేరుతో టోకరా.

  • హనుమకొండలో మహిళ అరెస్ట్
  • ప్రముఖ కాలేజీల్లో బీటెక్ సీట్లు ఇప్పిస్తానని బురిడీ.
  • 12 మంది విద్యార్థుల నుంచి రూ. 14.81 లక్షల వసూలు.
  • నిందితురాలిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు.
స్పాట్ వాయిస్, హనుమకొండ: ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ అడ్మిషన్లు ఇప్పిస్తానని చెప్పి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఒక మహిళను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కటకం స్వర్ణ రాణి అనే మహిళ ఈ మోసానికి తెరతీసింది. అడ్మిషన్లు కల్పిస్తానని నమ్మించి సుమారు 12 మంది విద్యార్థుల నుంచి మొత్తం కాలేజీ ఫీజు కింద ఏకంగా రూ.14,81,000 వసూలు చేసింది. తీరా డబ్బులు తీసుకున్నాక, కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కేవలం కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించింది. మిగతా ఫీజును తల్లిదండ్రులు తర్వాత కడతారని యాజమాన్యాలను నమ్మించింది. వసూలు చేసిన భారీ మొత్తాన్ని మాత్రం తన సొంత అవసరాలకు వాడుకుంది. రోజులు గడుస్తున్నా అడ్మిషన్ల విషయంలో స్పష్టత రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. హనుమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె. సతీష్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితురాలు స్వర్ణ రాణిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఆమెను నర్సంపేట జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మోసాన్ని వేగంగా ఛేదించిన ఎస్‌ఐ కె. సతీష్, క్రైమ్ విభాగం సిబ్బంది రవూఫ్, మహిళా కానిస్టేబుళ్లు జ్యోతి, మాధురి, రైటర్ బి. సతీష్‌లను హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular