స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామ పంచాయతీ 12వార్డు మెంబర్ పై సర్పంచ్ భర్త దాడి చేసిన ఘటన వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసుల కథనం ప్రకారం.. గ్రామపంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అభివృద్ది పనుల తీర్మనం విషయంలో చర్చించారు. సమావేశం అనంతంరం వార్డు మెంబర్లు బయటకు వెళ్లుతున్న క్రమంలో తీర్మానం విషయంలో వాగ్వాదం చేసుకోవడంతో 12 వార్డు మెంబర్ నాగరాజు పై సర్పంచ్ భర్త దాడి చేయడంతో వార్డు మెంబర్ ఈ సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సందర్బంగా వార్డు మెంబర్లు మాట్లాడుతూ.. నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్కి అనిత భర్త జక్కి శ్రీకాంత్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. గ్రామంలో జక్కి అనిత సర్పంచ్ గా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటీ వరకు ముగ్గురు వార్డు మెంబర్లపై వారి కుటుంబాలపై దాడులకు దిగి రౌడీయిజం చేస్తున్నారని గ్రామ వార్డు మెంబర్లు 12వ వార్డు మెంబర్ , 3 వ వార్డు సభ్యులు మరుపట్ల ప్రశాంత్ తెలిపారు. మంగళవారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ లో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఊర చెరువు కట్టకు సంబంధించిన బిల్లు విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తదువరి సమావేశంలో చర్చిద్దామని సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో సర్పంచ్ భర్త జక్కి శ్రీకాంత్ గ్రామ వంచాయతీలోకి వచ్చి సభ్యులను నానా బూతులు తిడుతూ.. 12వ వార్డు మెంబర్ అయిన నన్ను (ఆరెల్లి నాగరాజు) బిల్లు ఆగిపోవడానికి కారణం నువ్వే అంటూ తిడుతూ ఎందుకు తీర్మాణం చేయలేదంటూ గ్రామ పంచాయతీ ముందే భౌతిక దాడి చేశాడని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా గ్రామ పంచాయతీలో జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటున్న వార్డు సభ్యులను దాడిచేసి బెదిరింపులకు పాల్పడిన గ్రామ సర్పంచ్ జక్కి అనిత భర్త జక్కి శ్రీకాంత్ ను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు నాగరాజు కోరారు. అదే విధంగా జనరల్ బాడీ మీటింగ్ లోనే పాల్గొన్న మరో 3వ వార్డు సభ్యుడు మురుపట్ల ప్రశాంత్ ను సైతం జక్కి శ్రీకాంత్ గ్రామ పంచాయతీ ముందే దాడికి పాల్పడి ఎప్పటికైనా నిన్ను చంవుతానని హెచ్చరించడంతో పాటు ఇష్టారాజ్యంగా దాడి చేసినట్లు ప్రశాంత్ తెలిపారు. దాంతో పాటు శ్రీకాంత్ ఇప్పటికే వలుమార్లు తనపై తన కుటుంబంపై దాడి చేసిన క్రమంలో ఒకసారి తన తల్లిపై హత్యాయత్నం చేశారని ప్రశాంత్ గుర్తు చేశారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు తక్షణమే స్పందించి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.

