స్పాట్ వాయిస్ కాజీపేట: పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? సంపన్న కాలనీలో పేదలకు నివసించే హక్కు లేదా అని ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, సామాజికవేత్త కేడల ప్రసాద్, జనసేన పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పద్మజాదేవి ప్రశ్నించారు. ఆదివారం కాజీపేట వైఎస్సార్ నగర్‌లోని సర్వే నంబర్లు 70, 71, 72, 73లో గుడిసెలను పరిశీలించారు. మూడు దశాబ్దాలుగా 150 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు ఉన్నా అధికార పార్టీ నాయకులు భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుడిసెవాసులను తొలగించకుండా అదే స్థలంలో పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, పేదలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.

