ePaper
Monday, October 26, 2026
ePaper
Homeతెలంగాణపట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

 

రేపు గ్రామ పంచాయతీలో ప్రత్యేక సహాయ శిబిరం

నవంబర్ 6 వరకు తుది గడువు

 ‘ఫారం-18 ఆవిష్కరించిన సర్పంచ్ రాధిక శ్రీనివాస్

స్పాట్ వాయిస్, గణపురం:త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన విద్యావంతులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోఆర్డినేటర్లు బోనాల రాజమౌళి, దూలం కుమారస్వామి గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్‌తో కలిసి వారు ఓటరు ‘ఫారం-18 నమోదు పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటరు నమోదుకు సహకరించేందుకు సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా ‘ఫారం-18 సహాయ శిబిరం’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం నిబంధనల ప్రకారం ఈసారి తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ 6వ తేదీ వరకు నమోదుకు గడువు ఉందని తెలిపారు. గ్రామంలోని గ్రాడ్యుయేట్లు తమ డిగ్రీ ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఆదివారం నాటి శిబిరానికి హాజరై ‘ఫారం-18’ సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular