ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeతెలంగాణగ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు కావాలి

గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు కావాలి

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గంలోని అర్హులైన గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. 2027 మార్చిలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సెప్టెంబర్ 28, 2026 నుంచి కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే జాబితాలో పేరున్నవారు కూడా కొత్త ఫారం–18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు, అవసరమైన సర్టిఫికెట్ల ధ్రువీకరించిన ప్రతులను జత చేయాలని పేర్కొన్నారు. ప్రతి అర్హుడు గడువులోగా నమోదు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular