ePaper
Monday, September 7, 2026
ePaper
Homeరాజకీయంవరంగల్‌ పాలిటిక్స్‌లో హైటెన్షన్‌.. తర్వాత ఎవరు?

వరంగల్‌ పాలిటిక్స్‌లో హైటెన్షన్‌.. తర్వాత ఎవరు?

📰 Generate e-Paper Clip

వరంగల్‌కు మంత్రి పదవి ఔట్‌!
కేబినెట్‌లో తగ్గిన ప్రాధాన్యం..
సురేఖ బర్తరఫ్‌తో కొత్త లెక్కలు
స్పాట్‌వాయిస్‌, వరంగల్‌: కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో వరంగల్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది. సురేఖ బర్తరఫ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు సిఫారసు చేయడం ఖరారైన నేపథ్యంలో.. ఇక వరంగల్‌కు కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఉండదా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే సురేఖ స్థానంలో బీసీ మహిళకు మంత్రి పదవి దక్కే అవకాశాలపై చర్చ సాగుతున్నా.. ఆ అవకాశం వరంగల్‌కే దక్కుతుందా? లేక మరో జిల్లాకు వెళ్తుందా? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో గుండు సుధారాణికి కుడా చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వడం కూడా ఉమ్మడి వరంగల్‌ రాజకీయ సమీకరణాల్లో మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. సురేఖ ఔట్‌.. వరంగల్‌కు కొత్త మంత్రి ఇన్‌ అవుతారా? లేక కేబినెట్‌లో వరంగల్‌ ప్రాధాన్యమే తగ్గుతుందా? ఈ రెండు ప్రశ్నలే ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular