ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండలయన్స్‌కు అన్నప్రసాదంపై ప్రత్యేక దృష్టి

లయన్స్‌కు అన్నప్రసాదంపై ప్రత్యేక దృష్టి

📰 Generate e-Paper Clip

ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు

 

స్పాట్ వాయిస్, కాజీపేట: లయన్స్‌ సేవా కార్యక్రమాల్లో అన్నప్రసాద వితరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు సూచించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో కూడిన 320ఎఫ్ జిల్లా 11వ క్యాబినెట్ ఇన్‌స్టాలేషన్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, జిల్లా ప్రథమ లయన్ లేడీ అనిత రెడ్డి, జిల్లా గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో 100 కుట్టుమిషన్లు, 2,000 స్కూల్ బ్యాగులు, 80 సైకిళ్లు పంపిణీ చేశారు. 22 వాహనాల ద్వారా లక్షన్నర మందికి అన్నప్రసాదం అందిస్తున్నట్లు బాబురావు తెలిపారు. నాబార్డ్ కార్యక్రమాలను లయన్స్ సేవలతో సమన్వయం చేస్తామని ఉదయభాస్కర్ అన్నారు. పాము శ్రీనివాస్, చొప్పరి సోమయ్య, చంద్రగిరి ప్రసాద్, కటంగూరు రాంగోపాల్ రెడ్డి, డా. దివి అజిత్ కుమార్, బజాజ్ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular