చేయూత పెన్షన్లు.. ఒక్కరోజే ఛాన్స్

31తో ముగియనున్న గడువు. స్పా ట్ వాయిస్, తెలంగాణ: రాష్ట్రంలో కొత్తగా ‘చేయూత’ పింఛన్లు పొందాలనుకునే అర్హులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఆగస్టు 31తో ముగియనుంది. దీంతో అర్హత ఉన్నవారు చివరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అర్హులకు కొత్త పింఛన్లు అందించడంపై ప్రభుత్వం దృష్టి...