ePaper
Monday, September 7, 2026
ePaper
Homeఎడిటోరియల్కారులో డెడ్‌బాడీ..

కారులో డెడ్‌బాడీ..

📰 Generate e-Paper Clip

  • హనుమకొండ జిల్లాలోకలకలం

స్పాట్ వాయిస్, క్రైం :  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు కారును గత రెండు రోజులుగా అక్కడే వదిలేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కారు నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించగా, వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు, కారు యజమాని ఎవరనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహం లభించిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కారును ఎవరు అక్కడికి తీసుకొచ్చారు? మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular