ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeతెలంగాణనర్సంపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా శ్రీనివాస్ రెడ్డి..

నర్సంపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా శ్రీనివాస్ రెడ్డి..

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా ఇ. శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు పి. మధుసూదన్ రెడ్డి, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షుడు కళింగ కృష్ణ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురావు లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన ఇ .శ్రీనివాస్ రెడ్డిని, పలువురు కళాశాలల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, అధ్యాపక సంఘాల నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఇ. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఉన్నతాధికారుల మార్గదర్శకాల మేరకు కళాశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారంతో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. కళాశాల అభివృద్ధిని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పలు అధ్యాపక సంఘాల ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular