ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యం

ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, దామెర: దామెర మండలం దమ్మన్నపేట గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ దుబాసి నవీన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, పర్యావరణహిత వస్తువులు మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, గాలి కాలుష్యం పెరిగి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామాన్ని స్వచ్ఛమైన, ప్లాస్టిక్ రహిత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు; కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సిబ్బంది, మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular