ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఆర్టీసీ బస్సు–కారు ఢీ: ఇద్దరు మహిళలకు గాయాలు

ఆర్టీసీ బస్సు–కారు ఢీ: ఇద్దరు మహిళలకు గాయాలు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, రేగొండ :జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భగీర్తిపేట మెయిన్ రోడ్డులోని కొడవటంచ ఆర్చి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు, పరకాల వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డీటీఓ కార్యాలయ అధికారి రజిత, లక్ష్మి గాయపడ్డారు. ప్రమాదం అనంతరం స్థానికులు స్పందించి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular