ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండముగిసిన ఉచిత సంస్కృత భాషా శిబిరం

ముగిసిన ఉచిత సంస్కృత భాషా శిబిరం

📰 Generate e-Paper Clip

హన్మకొండలోని శ్రీ రామకృష్ణ సేవా మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహణ
సంస్కృత భారతి టీమ్ సభ్యులను అభినందించిన కటంగూరి సత్యనారాయణ రెడ్డి

స్పాట్ వాయిస్, హన్మకొండ : సంస్కృతభారతి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన ఉచిత సంస్కృత భాషా శిబిరం ఘనంగా ముగిసింది. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ లోని శ్రీ రామకృష్ణ సేవా మందిరంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంస్కృత భాషపై ఆసక్తి ఉన్న వారికి ఉచిత సంస్కృత భాషా ప్రవేశవర్గల శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కేవలం మూడు రోజుల్లోనే సంస్కృతంలో సరళంగా మాట్లాడేలా ప్రత్యేక పద్ధతిలో శిక్షణను ఇచ్చిన సంస్కృత భారతి టీమ్ సభ్యులు అభినందనీయులని పేర్కొన్నారు. సంస్కృతంలో తర్ఫీదు పొందిన సాధకులు అదృష్టవంతులని అన్నారు. ఇకనుండి ప్రతి ఆదివారం యోగా, ధ్యానంతో పాటు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని, ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో వరంగల్ సంస్కృత భారతి ప్రతినిధులు ఆనంద్, వరలక్ష్మి, సంపత్ కుమార్, పేట శ్రీనివాస్ దంపతులు, రామానంద సాగర్, రామన్న, కాకతీయ రచయితల వేదిక అవధాని చేకూరి శ్రీరామ్, దాత డాక్టర్ శివ రాణి, సేవా సమితి ప్రధానకార్యదర్శి ప్రభు చైతన్య, యువ విభాగ్ సభ్యులు నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular