ప్రథమ సంవత్సరంలో 44.55%.
ద్వితీయ సంవత్సరంలో 64.77%.
స్పాట్ వాయిస్ పరకాల: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ కె సంపత్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎం పి సి గ్రూపు లో ఎం. సాత్విక్ 985/1000, సాయు ప్రణయ్ 968/1000, డి. సాత్విక్ రామ్ 912/1000, ఎం ఎల్ టి గ్రూపులో ఆర్. జ్యోతి కుమార్ 968/1000,బి. అమూల్య 912/1000, ఎం పి హెచ్ డబ్యు గ్రూపులో జె. శ్యామల 943/1000, బై పి సి గ్రూపులో ఆర్. అజయ్ 819/1000 మార్కులు సాధించి కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చెప్పారు.అదేవిధంగా మొదటి సంవత్సరంలో ఎం పి సి గ్రూపులో జి. హార్దిని 467/470, ఎం పి హెచ్ డబ్యు గ్రూపులో కె.స్వప్న 460/500, ఎం ఎల్ టి గ్రూపులో కె. రాహుల్ 452/500, బై పి సి లో బి.ప్రమోద్ 396/440 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. కళాశాలలో మొదటి సంవత్సరంలో 202 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 90 మంది ఉత్తీర్ణులై 44.55% ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరంలో 176 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా,114 మంది ఉత్తీర్ణులై 64.77% ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే. సంపత్ కుమార్ ఇంటర్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను,ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపక సిబ్బందిని, తల్లిదండ్రులను అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రైవేట్ కళాశాలలకు దీటుగా తమ కళాశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఫెయిల్ అయి, మార్కులు తక్కువ వచ్చినటువంటి విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికాకుండా, దృఢంగా ఉండి మే నెలలో 13 నుండి 21 వ తేదీ వరకు నిర్వహించే సప్లమెంటరీ పరీక్షల్లో తమ సత్తాను చాటాలని, భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు..ఈ నెల 13 తేదీ నుంచి 20 వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్ష ఫీజును కళాశాలలో చెల్లించవచ్చని తెలిపారు…

