ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

-సర్పంచ్ దుబాసి నవీన్

స్పాట్ వాయిస్ దామెర: గ్రామంలో ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చి,సమగ్ర విద్యాభివృద్ధి సాధించడమే లక్ష్యమని సర్పంచ్ దుబాసి నవీన్ అన్నారు.ఆదివారం మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ”అమ్మకు అక్షరమాల” కార్యక్రమంలో భాగంగా అభ్యాసకులకు వాలంటీర్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుబాసి నవీన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా అవసరమని, సమాజంలో ఆర్థిక, సామాజిక పరమైన అంశాల పైన అవగాహన  రావాలంటే విద్యావంతులుగా మారాలని అన్నారు. గ్రామంలోని నిరక్షరాస్యులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అక్షరాస్యులుగా మారాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కో – ఆర్డినేటర్ నాగరాజు, మహిళా సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular