ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్తీర్థయాత్రలో విషాదం..

తీర్థయాత్రలో విషాదం..

📰 Generate e-Paper Clip

  • తీర్థయాత్రలో విషాదం..
  • ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు 
  • వరంగల్ కు చెందిన ముగ్గురి మృతి 
  • స్పాట్ వాయిస్, వరంగల్ : తీర్థయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని తిరుపతి – బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద రోడ్డుపై ఆగిఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టి.. బస్సు కిందికి దూసుకెళ్లింది. కారులో బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరగగా, వరంగల్ కు చెందిన దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మితోపాటు నాలుగేళ్ల చిన్నారి ఆద్విక మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమాచారం అందుకొని ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
RELATED ARTICLES
- Advertisment -

Most Popular