ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeతెలంగాణభూపాలపల్లి కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు..

భూపాలపల్లి కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు..

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో ఉన్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డి కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టి, ప్రాజెక్టుకు సంబంధించిన పలు ఫైళ్లు, రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.ప్రాజెక్టు పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతులు, నిధుల వినియోగం, బిల్లులు, పనుల పురోగతి రికార్డులతో పాటు ఇతర కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సోదాలకు గల అసలు కారణాలు ఏమిటి? ఏవైనా ఫిర్యాదులు లేదా అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సోదాలకు సంబంధించి ఏసీబీ అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular