ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణదసరా వేళ మద్యం అమ్మకాలు రూ.2,054 కోట్లు

దసరా వేళ మద్యం అమ్మకాలు రూ.2,054 కోట్లు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణలో దసరా పండుగ సీజన్‌లో మద్యం విక్రయాల విలువ గణనీయంగా పెరిగింది. 19 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల విలువ 37.02 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బీర్ల విక్రయాలు 30.37 లక్షల కేసులకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 8.82 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. బీర్ల విక్రయాల్లో 40.93 శాతం, ఇతర మద్యం విక్రయాల్లో 29.80 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్ 19న ఒక్కరోజే రూ.303.40 కోట్ల విలువైన విక్రయాలు జరగడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular