ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 25 మంది పోలీసుల ప్రాణత్యాగం

అమరుల కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సీపీ ఎన్. శ్వేత

స్పాట్ వాయిస్, హనుమకొండ: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరుల స్థూపం వద్ద ఆమె, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో కలిసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల ధైర్యం, కర్తవ్యనిష్ఠ, అంకితభావం అందరికీ ఆదర్శమన్నారు. నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. యువత అమరవీరుల స్ఫూర్తితో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

కమిషనరేట్ పరిధిలో 25 మంది అమరులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 25 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని ఎన్. శ్వేత తెలిపారు. వారి సేవలను ఎప్పటికీ మరచిపోలేమని, ప్రజల భద్రత కోసం వారు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అడిషనల్ డీసీపీలు రాయల ప్రభాకర్ రావు, బాలస్వామి, సురేష్, శ్రీనివాస్, ఏసీపీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular