ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణజనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి 

జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి 

📰 Generate e-Paper Clip

 

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్..

ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేని కలిసిన నీలం..

హామ్ తుమారే సాత్ హై మధు అంటూ నీలంను ప్రోత్సహించిన ఖర్గే..

ఖర్గేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నీలం..

స్పాట్ వాయిస్, బ్యూరో :

తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కలిపించాలని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలిసి విన్నవించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్.. సోమవారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా (కలబురగి) పరిధిలోని బుద్ధ విహార్ ట్రస్ట్ లో ఖర్గేను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. జనాభా దామాషా ప్రకారం తెలంగాణలో బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని, వివిధ అంశాలపై చాలా సేపు ఆయనతో చర్చించారు, ఈ సందర్భంగా చర్చించిన అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన ఖర్గే, హామ్ తుమారే సాత్ హై మధు అని నీలం మధును ప్రోత్సహించారు, అలాగే ఖర్గేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నీలం, ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular