జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర పూసల చైతన్య వేదిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కమిటీని రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ముదురుకోళ్ల రవి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ముదురుకోళ్ల తరుణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ పూసల కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలను విస్తరించి, కుల ఐక్యతను బలోపేతం చేస్తామని, సంచార జాతుల హక్కుల కోసం, పూసల కులాన్ని ఎంబీసీలో చేర్చాలనే డిమాండ్‌పై పోరాడతామని పేర్కొన్నారు.

