ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణరిమ్స్‌లో ఏసీ పేలి.. ఇద్దరు శిశువులు మృతి

రిమ్స్‌లో ఏసీ పేలి.. ఇద్దరు శిశువులు మృతి

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, బ్యూరో: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెను ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లల వార్డులోని ఎస్‌ఎన్‌సీయూలో ఏసీ పేలడంతో దట్టమైన పొగ అలుముకుంది. ఇంక్యూబేటర్లలో చికిత్స పొందుతున్న 27 మంది పసికందులకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది, అంబులెన్స్‌ డ్రైవర్లు వెంటనే స్పందించి శిశువులను బయటకు తరలించారు. ఇచ్చోడకు చెందిన ఐదు రోజుల చిన్నారి సహా ఇద్దరు పసికందులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన శిశువులను ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. కలెక్టర్‌ రాజార్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ రిమ్స్‌కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular