ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మిల్స్‌ కాలనీ పీఎస్‌లో కలకలం.. వ్యక్తికి మంటలు, ఇద్దరు పోలీసులకు గాయాలు

మిల్స్‌ కాలనీ పీఎస్‌లో కలకలం.. వ్యక్తికి మంటలు, ఇద్దరు పోలీసులకు గాయాలు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, వరంగల్: మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఘోర ఘటన చోటుచేసుకుంది. కట్ల హర్షిత్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని స్టేషన్‌లోకి వచ్చినట్లు సమాచారం. అతడిని కాపాడే ప్రయత్నంలో రైటర్ ప్రవీణ్, హెడ్ కానిస్టేబుల్ ముగ్ధుమ్‌కు గాయాలయ్యాయి. ముగ్గురినీ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. హర్షిత్ కుటుంబంలో కొనసాగుతున్న భార్యాభర్తల వివాదం నేపథ్యంలో ఘటన జరిగినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అసలు కారణం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular