రాపిడ్ టెస్ట్ లో ఇద్దరు యువకులకు పాజిటివ్.
మత్తు పదార్థాలు సేవించిన అమ్మిన కఠిన చర్యలు.
కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్.
స్పాట్ వాయిస్ మల్హర్:మండలంలో మత్తు పదార్థాలు సేవిస్తున్నారన్న అనుమానంతో కొయ్యూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ గ్రామాలకు చెందిన యువకులను రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్షించగా పెద్ద తూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు పాజిటివ్ వచ్చింది అని వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై పి. మహేందర్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీట్ కానిస్టేబుళ్ల వద్ద కూడా ఈ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంటాయని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అక్కడికక్కడే పరీక్షిస్తామని తెలిపారు. ఈ కిట్ ద్వారా గత ఆరు నెలల కాలంలో మత్తు పదార్థాలు సేవించినా నిమిషాల్లో తెలిసిపోతుందని హెచ్చరించారు.

మండలంలోని ప్రతి గ్రామంలో మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకుల వివరాలను సేకరిస్తున్నామని, వారి ప్రవర్తనపై నిఘా ఉంచామని అన్నారు.మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకులు స్వచ్ఛందంగా పోలీసులను సంప్రదిస్తే వారిపై కేసు నమోదు చేయకుండా డి-అడిక్షన్ సెంటర్‌కు పంపించి ఆ అలవాటు మాన్పించే ప్రయత్నం చేస్తామని, దీనివల్ల వారి భవిష్యత్తు బాగుంటుందని సూచించారు.అలా కాకుండా మత్తు పదార్థాలను రవాణా చేసినా, విక్రయించినా, కలిగి ఉన్నా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

