ePaper
Monday, September 7, 2026
ePaper
Homeజీవన విధానంఆదివారం ఆటవిడుపు...

ఆదివారం ఆటవిడుపు…

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, కాటారం: సెల్‌ఫోన్లకు దూరంగా.. వాన జల్లులను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు సంప్రదాయ ఆటల్లో మునిగితేలారు. ఆదివారం సెలవు కావడంతో కాటారం గ్రామంలో పిల్లలు మైదానం బాట పట్టారు. ఉదయం కురిసిన తేలికపాటి జల్లుల మధ్య మట్టి నేలపై గోలీలు, దాగుడుమూతలు వంటి ఆటలు ఆడుతూ కేరింతలు కొట్టారు. వారం రోజులు పుస్తకాలతో గడిపిన విద్యార్థులు బడి బ్యాగులను పక్కనపెట్టి స్నేహితులతో ఆటల్లో మునిగిపోయారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడుతున్న నేటి రోజుల్లో పిల్లలు మైదానంలో సంప్రదాయ ఆటలు ఆడటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. మట్టిలో ఆటలతో ఆరోగ్యంతో పాటు స్నేహభావం పెరుగుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular