స్పాట్ వాయిస్, మహబూబాబాద్ : గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించిన డోలి సంధ్య (28) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీతాకోకచిలుకల సెంటర్ సమీపంలోని తన ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
